Dharmana Krishna Das: ఆదాయానికి మించిన ఆస్తులు..ఏసీబీ సోదాలు..! 24 d ago
వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాజీ పిఏ మురళి నివాసాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణ దాస్ కు పిఏగా మురళి పనిచేశారు. మురళిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ,డీఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. కోటబొమ్మాలి మండలం దంత గ్రామం తో పాటు, లింగం నాయుడుపేటలోని ఆయన నివాసాలలో తనిఖీలు చేస్తున్నారు.